స్మార్ట్ ఫోన్ యూజర్లను హెచ్చరించిన కేంద్రం

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (16:42 IST)
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీ ఫోన్‌ను తమ కంట్రోల్‌‌లోకి తీసుకోవచ్చని, ఫోనులోని మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని అడ్డుకోవడానికి ఇండియన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అప్ డేట్ వెర్షన్‌ను రిలీజ్ చేసినట్లు తెలిపింది. వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
 
దేశంలో చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ ఇన్ పేర్కొంది. ఇప్పటికీ పాత వెర్షన్‌లోనే ఉన్న స్మార్ట్ ఫోన్లలోకి హ్యాకర్లు సులభంగా ప్రవేశిస్తారని, యూజర్‌కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని చెప్పింది. 
 
ఫొటోలు, యూపీఐ వివరాలు, ఇతరత్రా సమాచారం దొంగిలించవచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని పలు లోపాలను తాజాగా గుర్తించినట్లు తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి ముప్పుగా పరిణమిస్తాయని చెప్పింది. అంతేకాదు, హానికరమైన సాఫ్ట్ వేర్‌ను మీ ఫోన్‌లో ఇన్ స్టాల్ చేసే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది. 
 
కాగా, హ్యాకింగ్ ఉన్న ఫోన్ల వివరాలను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14.. ఈ వెర్షన్లు వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేటెస్ట్ వెర్షన్‌తో ఫోన్‌ను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ ఇన్ సూచన చేసింది. 

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments