బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (19:50 IST)

గూగుల్ ప్లే స్టోర్‌లో ఇండియన్ మిత్రోన్ ప్రభంజనం: 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లు (Video)

85 రోజుల్లో మిత్రోన్ యాప్‌లో మొత్తం 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లు.
 
గంటకు 40 మిలియన్ వీడియోల వీక్షణలు.

ఈ యాప్‌లో రోజుకు దాదాపు 1 మిలియన్ కొత్త వీడియోలు సృష్టించబడ్డాయి.
 
దేశీయంగా అభివృద్ధి చెందిన షార్ట్-ఫాం వీడియో యాప్ అయిన, మిత్రోన్ గూగుల్ స్టోర్‌లో 25+ మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించింది మరియు ఎక్కువ మంది విషయాంశ సృష్టికర్తలు ఈ యాప్‌లో చేరడానికి వరుస కడుతున్నారు. షార్ట్-వీడియో మేకింగ్ మిత్రోన్ యాప్ భారీ వీక్షకులను కూడా సంపాదించింది, ఈ వేదికలో గంటకు 40 మిలియన్ వీడియోలు చూడబడ్డాయి.
 శివాంక్ అగర్వాల్ మరియు అనీష్ ఖండేల్వాల్ ద్వారా స్థాపించబడిన మిత్రోన్ యాప్ 2020 ఏప్రిల్‌లో ప్రారంభించిన వెంటనే కీర్తి పతాకాన్ని ఎగురవేసింది.
 
వ్యవస్థాపకుల లక్ష్యం ఏమిటంటే, ప్రజలు తమ వినూత్నతను ప్రదర్శించడానికి డిజిటల్ ఎంగేజ్‌మెంట్ మరియు వినోదాన్ని తేలికపాటి హాస్యం యొక్క నేపథ్యానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో వీడియోలను పునఃచిత్రించే ఒక షార్ట్-ఫాం వీడియో యాప్ ను రూపొందించడం. 
మిత్రోన్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శివాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, “మిత్రోన్ ప్లాట్‌ఫామ్‌లో రోజుకు దాదాపు ఒక మిలియన్ కొత్త వీడియోలు సృష్టించబడటం చాలా ఉత్సాహంగా ఉంది.
 
లాక్ డౌన్ దశలో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు పరిమితం కావడంతో, ప్రజలు పోస్ట్ చేసిన చిన్న వీడియోల ద్వారా డిజిటల్ వినోదాన్ని అందించే వేదికను అందించడం లేదా వారి స్వంత వీడియోలను సృష్టించడం మా లక్ష్యం.” మిత్రోన్ యొక్క డెవలపర్‌లు, డేటా గోప్యతను నిర్ధారించడమే మా ప్రాధాన్యతగా పని చేస్తున్నారు. బెంగళూరు ఆధారిత ఈ యాప్ వినియోగదారులకు వారి వీడియోలను సృష్టించడానికి, సవరించడానికి మరియు పంచుకునేందుకు సులభమైన మరియు అవరోధరహిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది మరియు అదే సమయంలో ప్లాట్‌ఫాం లోని అగ్ర వీడియోల లైబ్రరీ ద్వారా బ్రౌజ్ చేసుకోవచ్చు.
 
మిత్రోన్ యాప్ గురించి: ఇద్దరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు, శివాంక్ అగర్వాల్ (ఐఐటి రూర్కీ పూర్వ విద్యార్థి) మరియు అనీష్ ఖండేల్వాల్ (విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి) చేత స్థాపించబడిన మిత్రోన్ యాప్ ఒక షార్ట్-ఫాం వీడియో యాప్, ఇది వినియోగదారులను వినోదభరితమైన చిన్న వీడియోలను సృష్టించడానికి, అప్‌లోడ్ చేయడానికి మరియు చూడటానికి వీలు కల్పిస్తుంది.
 
వినియోగదారు గోప్యత, డేటా సమగ్రత మరియు స్థానికీకరణపై లోతైన నిబద్ధతతో, మిత్రోన్ యాప్ ఇప్పటికే, ప్రారంభించిన కొన్ని వారాల వ్యవధిలోనే, 25 మిలియన్ + డౌన్‌లోడ్‌లకు వినియోగాన్ని చవి చూసింది. మిత్రోన్, 3వన్4 కాపిటల్ నేతృత్వంలో మరియు అరుణ్ తడాంకి నేతృత్వంలోని లెట్స్ వెంచర్ సిండికేట్‌తో తన సీడ్ రౌండ్‌ను జూలైలో ప్రకటించింది.