శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:24 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఒకేసారి పది ఫోటోలతో పాటు వీడియో అప్‌లోడ్ చేసుకోవచ్చు

సోషల్ మీడియాలో స్థానం సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ చేరింది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒకేసారి మల్టిపుల్ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒకే ఆల్బమ్‌ల

సోషల్ మీడియాలో స్థానం సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ చేరింది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒకేసారి మల్టిపుల్ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఒకే ఆల్బమ్‌లో అనేక ఫోటోలను షేర్ చేసుకునే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ తొలుత బీటా స్టేజ్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షించడంతో సక్సెస్ అయినట్లు ఇన్‌స్టాగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ కొత్త ఫీచర్లో భాగంగా పది ఫోటోలు లేదా వీడియోలు కలిపి ఒకేసారి పోస్టు చేసుకునే సౌకర్యం ఉంటుంది. వాటిని కూడా స్వైప్ చేస్తూ చూసుకునే అవకాశం ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
వినియోగదారుడి ఎక్స్‌పీరియన్స్‌తో మ్యాచ్ చేసేందుకు ఓ కొత్త డిజైన్‌తో 10 ఫోటోలు లేదా వీడియోల వరకు ఉండేలా కరోసిల్ యాడ్ యూనిట్లను కూడా పెంచినట్లు సంస్థ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం 60కోట్ల మంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.