Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జియోకు షాక్ : ఇంటెక్స్ టర్బో+ నుంచి 4జీ ఫోన్.. ధర..?

అన్ని టెలికాం కంపెనీలకు షాకిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు ఇంటెక్స్ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కంపెనీ తయారు చేసే మొబైల్స్ ఫోన్లలో నవరత్న సిరీస్ కింద అతి తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్లను తయారు

Written By pnr
Updated: బుధవారం, 2 ఆగస్టు 2017 (13:12 IST)
అన్ని టెలికాం కంపెనీలకు షాకిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు ఇంటెక్స్ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ కంపెనీ తయారు చేసే మొబైల్స్ ఫోన్లలో నవరత్న సిరీస్ కింద అతి తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ దీపావళి నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
నిజానికి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత టెలికాం రంగంలో 4జీ విప్లవం మొదలైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరూ ఈ తరహా ఫోన్లను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, 4జీ ఫోన్లులేని 50 కోట్ల మంది మొబైల్ వినియోగదారులను తనవైపుకు తిప్పుకునేందుకు రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో ఉచితంగా ఫోన్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇది పెను సంచలనంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్, ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ తరహా ఫోన్‌ను తక్కువ ధరకు విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇంటెక్స్ కంపెనీ టర్బో ప్లస్ 4జీ పేరిట ఓ నూతన 4జీ వీవోఎల్‌టీఈ ఫోన్‌ను విడుదల చేసింది. రూ.1500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు వచ్చే దీపావళి నుంచి అందుబాటులోకి రానుంది. 
 
ఇంటెక్స్ టర్బో ప్లస్ 4జీ ఫీచర్లను పరిశీలిస్తే... 2.4 ఇంచ్ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, కాయ్ (Kai) ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, టార్చి లైట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments