Daily Horoscope
✕

రిలయన్స్ డిజిటల్ షాపుల్లో ఐఫోన్-16 వేరియంట్లు

Written By సెల్వి
Updated: బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:00 IST)
భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ అయిన రిలయన్స్ డిజిటల్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్-16 అన్ని వేరియంట్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. 
 
కస్టమర్లు ముందుగా బుక్ చేసుకున్న ఖచ్చితమైన వేరియంట్ డెలివరీకి కంపెనీ హామీ ఇస్తుంది.  రిటైలర్ వారు ఈ నిబద్ధతను నెరవేర్చలేకపోతే ప్రీ-బుకింగ్ మొత్తాన్ని రెండింతలు వాపసు చేస్తామని హామీ ఇచ్చారు. 
 
వినియోగదారులు తమకు కావాల్సిన ఐఫోన్-16 వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ని సందర్శించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. 
 
గతేడాది వచ్చిన ముందస్తు బుకింగ్‌లతో పోలిస్తే ఈ సారి ఐఫోన్‌-16కి విశేష స్పందన లభించిందని, రెండింతలు బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పలు క్రెడిట్‌ కార్డులపై రాయితీ కూడా ఇస్తున్నట్లు తెలిపింది.

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

తర్వాతి కథనం
Show comments