suvichar

పెగాసెస్ ఎఫెక్ట్.. Windows and Apple యూజర్లకు కేంద్రం హెచ్చరిక

Written By సెల్వి
Updated: శుక్రవారం, 30 జులై 2021 (14:29 IST)
iPhone, iPad
పెగాసెస్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబర్ దాడులపై కేంద్రం అలర్ట్ అవుతోంది. పలు చర్యలకు ఉపక్రమిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. 
 
తాజాగా.. కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐ ప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
సైబర్ దాడులు జరిగే ఆపరేటింగ్ సిస్టమ్స్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమ్‌ హెచ్చరికలు జారీ చేసింది. విండోస్‌, ఆపిల్‌ ఐఫోన్‌, యాపిల్‌ ఐప్యాడ్‌, మాక్‌ యూజర్లకు హెచ్చరికలు చేసింది. 
 
సైబర్ నేరస్తులు, ప్రైవేటు, ప్రభుత్వ రంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాలను సేకరించేందుకు టార్గెటెడ్ కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లను ‘కోడ్ ఎగ్జిక్యూషన్’ సాయంతో దాడి చేస్తారని..ఆ సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేసింది. 
 
మితిమీరిన అనుమతుల కారణంగానే…యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ లో ఉన్న ఫైళ్లు, డేటా బేస్ తో పాటు సెక్యూర్టీ అకౌంట్స్ మేనేజర్ (SAM)లు భద్రతాలోపం తలెత్తినట్లు వెల్లడించింది. దీని కారణంగా…పాస్ వర్డ్ లను గుర్తించి… సిస్టమ్ డ్రైవ్‌లను దొంగిలించే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments