Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గూగుల్‌కే సవాల్.. ''జియో బ్రౌజర్'' వచ్చేస్తోంది..

Updated: సోమవారం, 7 జనవరి 2019 (17:27 IST)
భారత టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో వేగానికి ఇతర టెలికాం సంస్థలన్నీ డీలా పడిపోయాయి. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. ఆపై చౌక ధరకే డేటా అందించడం ద్వారా ఇతర టెలికాం సంస్థల ఆదాయాన్ని దెబ్బతీసింది. ఇందులో ఎయిర్ టెల్, వొడాఫోన్ లాంటి సంస్థలున్నాయి.


ఇలా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియో మెల్ల మెల్లగా ఆన్‌లైన్ ట్రేడింగ్, స్మార్ట్ ఫోన్ తయారీలపై నిమగ్నమైంది. ప్రస్తుతం రిలయన్స్ జియో షాకిచ్చే ప్రకటన చేసింది.
 
రిలయన్స్ జియో సంస్థ త్వరలో ''జియో బ్రౌజర్'' అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌ను పలు ప్రాంతీయ భాషల్లో ప్రకటించనుంది. ఇలా ప్రాంతీయ భాషల్లో బ్రౌజర్‌ను విడుదల చేసే తొలి సంస్థగా జియో నిలిచింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మొబైళ్లకు మాత్రం గూగుల్ ప్లే స్టోర్‌లో జియో బ్రౌజర్‌ను ప్రవేశపెట్టడం జరిగింది.

త్వరలో ఐఫోన్‌లో జియో బ్రౌజర్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గూగుల్ బ్రౌజర్‌కే సవాల్ చేసే దిశగా ఈ బ్రౌజర్ వుంటుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
జియో బ్రౌజర్ అనే ఈ ప్రత్యేక యాప్‌ ద్వారా సులభంగానూ, వేగంగానూ బ్రౌజింగ్ చేసుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ కనీసం 4.8ఎంబీ మాత్రమే. ఇంకా తమిళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ వంటి ఎనిమిది భాషల్లో జియో బ్రౌజర్‌ను ఉపయోగించుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments