మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (14:07 IST)

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... కొత్త కస్టమర్లకే...

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియే సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో టెలికాం ధరలు కూడా కిందికి దిగివచ్చాయి.
 
అదేసమయంలో టెలికాం కంపెనీల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా వివిధ రకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేపనిలో నిమగ్నమయ్యాయి. ఇందులోభాగంగా, ఇపుడు ఎయిర్‌టెల్ కంపెనీ తన కొత్త కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్‌తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న కొత్త కస్టమర్లకు రూ.26 టాక్ టైమ్ కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. ఇది కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. 
 
ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లు ముందుగా రూ.76 ఫస్ట్ టైం రీఛార్జ్ (ఫస్ట్ రీఛార్జ్) చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ఎఫ్ఆర్సీ రీఛార్స్‌లపై వరుసగా రూ.178, రూ.229, రూ.344, రూ.495, రూ.599 ప్యాకులను అందిస్తోన్న ఎయిర్ టెల్ జాబితాలో రూ.76 రీఛార్జ్ వచ్చి చేరింది. ఈ ఎఫ్ఆర్సీ పోర్ట్ పోలియో నుంచి కొత్త కస్టమర్లు 126 జీబీ డేటా బెనిఫెట్స్ పొందవచ్చు. వాయిస్ కాల్స్ ప్రతి నిమిషానికి 60 పైసలు చొప్పున ఛార్జ్ అవుతుంది.