శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (16:41 IST)

లావా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఫేస్ అన్‌లాక్ ఫీచర్.. ధరెంతో తెలుసా?

లావా నుంచి భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ జడ్ 53 విడుదలైంది. 6.1 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌‌తో కూడిన ఈ ఫోనులో ఫేస్ అన్ లాక్ ఫీచర్ అందిస్తున్నారు. దీంతో కేవలం 0.4 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్ లాక్ చేసుకునే వీలుంటుంది.
 
16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌, 8, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2, 4120 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోనులో గూగుల్‌ అసిస్టెంట్‌కు గాను డెడికేటెడ్‌ బటన్‌ను అందిస్తున్నారు. అలాగే 50జీబీ అదనపు డేటా ఉచితంగా లభిస్తుంది. అంతేగాకుండా.. 8 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 
 
లాంఛింగ్ ఆఫర్లు 
ఈ ఫోన్ ధర రూ.4829 
ఫిఫ్ కార్టులో పలు ఆఫర్లు 
జియో వినియోగదారులు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.1200 విలువైన ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ను వౌచర్లు పొందవచ్చు.