Daily Horoscope
✕

ఎల్జీ నుంచి రోలింగ్ ల్యాప్ టాప్.. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 24 నవంబరు 2020 (19:21 IST)
Laptop
ఎల్జీ నుంచి ఇప్పటికే రోలింగ్ మొబైల్స్ వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా ఈ మొబైల్స్‌ ఉండనున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. అది కూడా ఎల్‌జీ నుంచే. ఈ మేరకు పేటెంట్‌ ఇమేజెస్‌ కొన్ని ఆన్‌లైన్‌ చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్, మోటోరోలా, హువావే ఇప్పటికే ఫోల్డింగ్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేశాయి. 
 
ఎల్‌జీ త్వరలోనే 17-అంగుళాల రోలింగ్ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ తీసుకురానుందట. ఈ మేరకు రూట్‌ మై గెలాక్సీ పేరుతో రోలింగ్ ల్యాప్‌టాప్‌ డిజైన్‌కు సంబంధించిన హక్కులను ఇటీవలే పొందినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. రోలింగ్ ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లేని 13.3 అంగుళాల నుంచి 17 అంగుళాల సైజు వరకు ఉపయోగించుకోవచ్చు. 
 
అలానే ల్యాప్‌టాప్‌ కీబోర్డు కూడా మడతపెట్టేయొచ్చు. ఇప్పటికే ఎల్‌జీ వింగ్, జీ8 ఎక్స్‌ థింక్యూ పేరుతో డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలోనే దీనిపై ఎల్‌జీ నుంచి రోలింగ్‌ ల్యాప్‌టాప్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

అన్నీ చూడండి

Sai Durga Tej: అంగరంగ వైభవంగా సాయి దుర్గా తేజ్, కిరణ్ నిశ్చితార్థం

జాన్వీ, రాధికా ఆప్టేలపై రెజీనా ఫైర్.. అసౌకర్యంగా అనిపిస్తే తప్పుకోండి.. అంతేకానీ సినిమా ఇండస్ట్రీలో..?

Kazakhstan; యాక్షన్ సీక్వెన్స్, స్పెషల్ సాంగ్ కోసం కజకిస్థాన్‌ వెళ్ళిన జనవరి 12 విడుదల టీమ్

Rajamouli: రామాయణం ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి : రాజమౌళి

Allu Arjun : ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా, పవర్‌ప్యాక్డ్ లుక్‌తో మెరిశారు

తర్వాతి కథనం
Show comments