Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీకి పోటీగా దేశీ వీడియో గేమ్.. పబ్‌జీ మొబైల్ ఇండియా పేరిట..?

Written By సెల్వి
Updated: గురువారం, 26 నవంబరు 2020 (17:03 IST)
దేశంలో పబ్ జీకి పోటీగా కొత్త గేమ్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం పబ్ జీ గేమ్‌పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ త్వరలో ఆవిష్కృతమవుతున్న సంగతి తెలిసిందే. 
 
భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. మోది పిలుపిచ్చిన ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా ఈ గేమ్‌ను తీసుకొస్తున్నట్టు బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు.
 
హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్‌లో టీజర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచే ప్రజలు మరీంత అసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
పబ్ జీ కూడా కార్పొరేషన్ 'పబ్‌జీ మొబైల్ ఇండియా' పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్‌జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
 
ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేస్తామని కంపెనీ గతంలో పేర్కొన్నప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్‌కోర్‌ గేమ్స్‌ పేర్కొంది. 
 
భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ పబ్‌జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ - 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్‌కోర్ గతంలో ప్రకటించింది.  

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments