శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (10:49 IST)

భారత మార్కెట్లోకి నార్జో70టర్బో 5జీ మోడల్‌.. ఫీచర్స్ ఇవే

Realme Narzo 70 Turbo
Realme Narzo 70 Turbo
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మంగళవారం నార్జో70టర్బో 5జీ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సెప్టెంబర్ 16న మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమెజాన్, రియల్‌మి ఇండియాలో రియల్‌మి ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
 
రియల్‌మి నుంచి లేటెస్ట్ గేమింగ్-ఫోకస్డ్ ఆఫర్‌గా రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త నార్జో సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
 
ఫీచర్స్
ఈ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ 6.67-అంగుళాల శాంసంగ్ ఇ4 ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. జీటీ మోడ్‌ను కలిగి ఉంది. ప్రధాన గేమ్ టైటిల్‌లపై 90fps అందజేస్తుంది. 45డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.