సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (05:30 IST)

మీ ఫోన్‌లో జియో సిమ్‌ పనిచేస్తుందా? తెలుసుకోండిలా?

రిలయన్స్‌ జియో.. ఇటీవలికాలంలో ఇంత సంచలనం సృష్టించిన అంశం. జియో గురించి సెప్టెంబరు 1న రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించకముందే.. జియో సిమ్‌లకు డిమాండ్‌ పెరిగిపోయింది. అయితే, ప్రస్తుతం వాడుతున్న ఫ

రిలయన్స్‌ జియో.. ఇటీవలికాలంలో ఇంత సంచలనం సృష్టించిన అంశం. జియో గురించి సెప్టెంబరు 1న రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించకముందే.. జియో సిమ్‌లకు డిమాండ్‌ పెరిగిపోయింది. అయితే, ప్రస్తుతం వాడుతున్న ఫోన్లలో ఆర్-జియో సిమ్ కార్డు పని చేసే అవకాశం లేదు. ఇందుకోసం 4జి టెక్నాలజీతో ఉన్న ఫోన్‌ను వాడాల్సివుంది. అదీకూడా ఎల్‌టీఈ తోపాటు వోల్టీ(వీవోఎల్‌టీఈ) టెక్నాలజీతో ఉన్న ఫోన్ మాత్రమే. ఇంతకీ మీరు వాడుతున్న ఫోన్ ఆర్-జియో సిమ్‌కు పని చేస్తుందో లేదో ఓసారి పరిశీలిద్ధాం. 
 
4జీ మొబైల్‌ చేతిలో ఉన్నప్పటికీ ‘ఆ ఫోన్‌లో జియో సిమ్‌ పనిచేస్తుందా?’ అనే ప్రశ్నకు సమాధానం స్మార్ట్‌ఫోన్‌లోనే ఉంది. మీ చేతిలోవున్న ఆండ్రాయిడ్‌ 4జీ మొబైల్‌లో డయలర్‌ ఆన్‌ చేసి అక్కడ స్టార్‌ హ్యాష్‌ స్టార్‌ హ్యాష్‌ 4636 హ్యాష్‌ స్టార్‌ హ్యాష్‌ స్టార్‌ (*#*#4636#*#*) ఈ నంబర్లు నొక్కితే చాలు చివరి హ్యాష్‌ ఎంటర్‌ చేయకుండానే మొబైల్‌ స్ర్కీన్‌పై నాలుగు ఆప్షన్స్‌ వస్తాయి. 
 
దాంట్లో మొదటిది డ్రైవ్స్‌ ఇన్ఫర్మేషన్‌ లేదా ఫోన్‌ ఇన్ఫర్మేషన్‌ అని ఉంటుంది. దాన్ని ఎంచుకోవాలి కిందకు స్క్రోల్‌ చేస్తే నెట్‌వర్క్‌ టైప్‌ అని ఉంటుంది. అక్కడ జాబితానికి క్లిక్‌ చేసి దాంట్లో ఎల్‌టీఈ తోపాటు వోల్టీ(వీవోఎల్‌టీఈ) కూడా ఉంటే మీ మొబైల్‌ దానికి సపోర్టు చేస్తున్నట్లు లెక్క. అలా లేకుండా కేవలం ఎల్‌టీఈ అని మాత్రమే ఉంటే అది 4జీ డేటా ట్రాన్స్‌ఫర్‌కు మాత్రమే పనిచేస్తుంది. డేటా ద్వారా వాయిస్‌కాల్స్‌కు పనికిరాదని గుర్తించవచ్చు.