శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:06 IST)

ప్రైమ్ సభ్యత్వం తీసుకోని కనెక్షన్లు కట్... రిలయన్స్ జియో నిర్ణయం

దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు గట్టి షాకివ్వనుంది. ప్రైమ్ సభ్యత్వంతో పాటు.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్లు తీసుకోని వినియోగదారులను వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు గట్టి షాకివ్వనుంది. ప్రైమ్ సభ్యత్వంతో పాటు.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్లు తీసుకోని వినియోగదారులను వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఈనెల 15వ తేదీన గడువు ముగిసినప్పటికీ ఒకేసారి కటీఫ్ చెప్పకుండా... రీచార్జ్ చేసుకోవాలంటూ రెండు మూడు రోజుల పాటు మెసేజ్‌లో పంపిస్తూ వచ్చింది. ‘అవాంతరాలు లేని’ సేవల కోసం ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి అంటూ ప్రచారం చేసింది. అయినప్పటికీ స్పందించకుంటే ఒక్కొక్కరిగా కనెక్షన్ కట్ చేస్తున్నట్టు సమాచారం.
  
ఒకవేళ ఇప్పటికే డిస్‌కనెక్ట్ అయితే మళ్లీ జియో స్టోర్‌కి గానీ, వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లోకి వళ్లి రూ.408తో రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందులో రూ.99 ప్రైమ్ మెంబర్‌షిప్ రుసుం కాగా.. మిగతా రూ.309 ధనాధన్ ఆఫర్ అన్నమాట. 
 
వాస్తవానికి మార్చి 31తోనే సబ్‌స్క్రిప్సన్ తీసుకోనివారికి శుభంకార్డు తప్పదన్న జియో... తర్వాత గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. తాజాగా ఇప్పటికీ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కొనసాగిస్తుండడంతో... ఇంకా ఎంతకాలం అవకాశం ఇస్తుందన్నదానిపై సమాచారం లేదు.