శాంసంగ్ గెలాక్సీ ఏ82.. అందుబాటులోకి 64 మెగాపిక్సెల్ కెమెరా
శాంసంగ్ గెలాక్సీ ఏ82 స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో రానుంది. గతంలో లాంచ్ అయిన గెలాక్సీ ఏ80కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. దీంతోపాటు ఇందులో శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ1 సెన్సార్‌కు బదులు సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ గురించి మిగతా సమాచారం తెలియరాలేదు.
గెలాక్సీ ఏ80 తరహాలో ఇందులో కూడా స్వివెల్ మెకానిజం (సెల్ఫీ కెమెరాలా వాడే టెక్నాలజీ) ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన 5జీ వెర్షన్ బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్ బెంచ్ వెబ్ సైట్లలో కనిపించింది. దీని కెమెరా గురించిన సమాచారం మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ యూరోప్‌లో కాకుండా దక్షిణకొరియాలో మాత్రమే లాంచ్ కానుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఇందులో డేటా ఎన్‌క్రిప్షన్ కోసం క్వాంటం ర్యాండం నంబర్ జనరేటర్ (క్యూఆర్ఎన్‌జీ) కూడా ఉండనుంది. శాంసంగ్ ఫోన్లలో సాధారణంగా అందించే నాక్స్ సిస్టంతో పాటు మరో సెక్యూరిటీ లేయర్‌గా ఇది ఉపయోగపడనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ82 డిజైన్ కూడా గెలాక్సీ ఏ80 తరహాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో కూడా స్వివెల్ మెకానిజంను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు కెమెరాలనే ముందువైపు కూడా ఉపయోగించుకునే విధంగా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఈ ఫోన్ ఇటీవలే బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్ బెంచ్ వెబ్ సైట్లలో కూడా కనిపించింది.