స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే దిశగా వాట్సాప్‌లో Caller ID Service
స్పామ్ కాల్స్‌ను గుర్తించే దిశగా ట్రూ-కాలర్ త్వరలో తన సేవలను వాట్సాప్ ఇతర మెసేజింగ్ యాప్‌లలో అందుబాటులో ఉంచేందుకు ప్రారంభిస్తుందని ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి తెలిపారు. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ కాలర్-ఐడీ సర్వీస్ మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని అలాన్ వెల్లడించారు.
భారతదేశం వంటి దేశాల్లో టెలిమార్కెటింగ్, స్కామింగ్ కాల్‌లు పెరుగుతున్నాయి. వినియోగదారులు సగటున నెలకు 17 స్పామ్ కాల్‌లను పొందుతున్నారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి టెలికాం ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రూ-కాలర్ తెలిపింది.