ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (10:29 IST)

వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇదే...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి ర

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. 
 
ప్రస్తుతం వారికి కాల్స్ స్విచ్చింగ్ అనే అదిరిపోయే ఫీచర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము వాయిస్ కాల్స్‌లో ఉన్నప్పుడు వీడియోకాల్స్‌కు, వీడియో కాల్స్‌లో ఉన్నప్పుడు వాయిస్ కాల్స్‌కు సులభంగా మారవచ్చు. 
 
గతంలో ఇలా మారాలంటే కాల్స్‌ను కట్ చేసి తిరిగి కావాలనుకున్న కాల్‌ను చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడాపరిస్థితి లేకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఏ కాల్‌లో ఉన్నప్పటికీ దాన్ని కట్ చేయకుండానే మరో రకమైన కాల్‌కు మారవచ్చు.