సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (17:48 IST)

ఏప్రిల్‌లో 16 లక్షల భారత అకౌంట్లపై వాట్సాప్ నిషేధం, ఎందుకు?

whatsapp
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఎందుకంటే.. ఈ వాట్సాప్ అకౌంట్లన్నీ ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కారణమని నివేదిక వెల్లడించింది. 
 
ఏప్రిల్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 1, 2022 నుంచి 30 ఏప్రిల్ 2022 వరకు డేటాను విశ్లేషించింది. 
 
ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. ఏప్రిల్ 2022 నెలలో నివేదికను ప్రకటించామన్నారు. యూజర్-సెక్యూరిటీ నివేదికలో స్వీకరించిన యూజర్ల ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం ఏప్రిల్ నెలలో 1.6 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించిందని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.