Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో రానున్న న్యూ ఫీచర్ ఇదే...

Updated: ఆదివారం, 13 జనవరి 2019 (10:19 IST)
సోషల్ మీడియాలో ప్రసారసాధనాల్లో ఒకటైన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకిరానుంది. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ పేరిట ఈ కొత్త ఫీచర్ త్వరలో యూజర్లకు లభ్యంకానుంది. ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ వాట్సాప్‌కు పిన్‌, ప్యాట్ర‌న్‌, పాస్‌కోడ్‌, ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ, ఫింగ‌ర్ ప్రింట్ లాక్‌లలో ఏదైనా లాక్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాట్సాప్ ఓపెన్ అవ్వాలంటే అదే లాక్ వాడాల్సి ఉంటుంది. 
 
ఈ ఫీచ‌ర్ వ‌ల్ల ఒక యూజ‌ర్ వాట్సాప్ అకౌంట్‌ను మ‌రొక యూజ‌ర్ వాడ‌లేరు. దీంతో యూజ‌ర్ల‌కు పూర్తి సెక్యూరిటీ ల‌భిస్తుంది. అయితే ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ బీటాను వాడుతున్న యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రాగా, త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ ల‌భ్యంకానుంది. 
 
ఇక వాట్సాప్‌లో త్వ‌ర‌లో మరో ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. దాని స‌హాయంతో యూజ‌ర్లు తాము పంపాల‌నుకునే ఆడియో ఫైల్స్‌ను ముందుగానే విన‌వ‌చ్చు. అలాగే డివైస్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ అన్నీ వాట్సాప్‌లో లిస్ట్ అవుతాయి. ఇక కేవ‌లం ఒక ఆడియో ఫైల్ మాత్ర‌మేకాకుండా, మ‌ల్టిపుల్ ఆడియో ఫైల్స్‌ను ఒకేసారి పంపుకునే ఫీచ‌ర్‌ను కూడా త్వ‌ర‌లో అందివ్వ‌నున్నారు. 

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments