Dharma Sangrah

మీరు చెప్పినట్లు వినే షియోమి స్మార్ట్ బల్బ్..!

Written By వాసు
Updated: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:24 IST)
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తుల తయారీ కంపెనీ షియోమి తన అభిమానుల కోసం మరో తాజా ఉత్పత్తిని దేశీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అయితే, అది మొబైలో, ట్యాబో కాదు, సాధారణ ఎలక్ట్రిక్ ఎల్‌ఈడీ బల్బ్, కాగా మీరు చెప్పినట్లు వినడం ఈ బల్బ్ ప్రత్యేకత. 
 
షావోమి తాజాగా తీసుకువచ్చిన ఈ ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్... ధర రూ.999గా చెప్తున్నారు. అయితే తొలి 4,000 ఆర్డర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందట. ఆ తర్వాత ఆర్డర్‌లకు ఈ బల్బ్ ధర రూ.1,299కు చేరుకుంటుందట. కాగా... బల్బ్ షిప్‌మెంట్స్ మే నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. 
 
ఇంతకీ ఈ ఎంఐ స్మార్ట్ బల్బ్‌ ప్రత్యేకతలు ఏమిటంటే... ఇది గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాకు బల్బ్ ఆఫ్ చేయమని ఆదేశం ఇస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. వాటితోపాటు దీన్ని ఎంఐ హోమ్ యాప్ సాయంతో కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా కలర్లలో అందుబాటులో ఉండే ఈ బల్బ్‌లో నచ్చిన దాన్ని సెట్ చేసుకోవచ్చు. బల్బ్ 11 ఏళ్లపాటు మన్నుతుందని కంపెనీ చెప్తోంది. 
 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments