ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:43 IST)

రూ.7,999కే షియోమీ రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్..

భారతదేశ మొబైల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది.
 
ఈ ఫోన్ ఈనెల 29వ తేదీ నుండి అమేజాన్, ఎంఐ హోం స్టోర్స్‌లో రూ. 7,999 ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
 
షియోమీ రెడ్‌మీ 7 ప్రత్యేకతలు...
* 6.26 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 1520 × 720 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 
 
* 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 
 
* 12, 2 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 
 
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సదుపాయం కలదు.