Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిల్లలు క్యారట్, చీజ్, పాలు.. ఎందుకు తీసుకోవాలో తెలుసా?

Written By సందీప్
Updated: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:14 IST)
పౌష్టికాహార లోపం వల్ల బలహీనంగా ఉండే పిల్లలను చాలా మందిని చూసుంటాం. సరైన ఆహారం తినకపోవడం వల్ల సన్నగా తయారవ్వడం, చలాకీతనం లేకపోవడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. వీటికితోడు నిరుత్సాహం, బద్దకం కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలు మంచి ఆహారం తీసుకోకపోతే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
 
ముఖ్యంగా వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకి విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలకు బలాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా క్యారట్, చీజ్, పాలు, గుడ్డులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే మంచిది. టమోటాలు, తాజా కూరగాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ధృడత్వానికి, అందమైన చర్మాన్ని పొందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మజాతి పండ్లను పిల్లలకు తరచూ ఇస్తుండాలి. పిల్లలలో రక్తం పట్టడానికి ఐరన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ పిల్లలకు పెట్టాలి. దీని వలన పిల్లలు ఎంతో ఉత్సాహంగా తయారవుతారు. పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువులు, ఆటల్లో రాణించగలుగుతారు.

అన్నీ చూడండి

కర్ణాటకలో దసరా వేడుకలకు సిద్దమైన బెంగళూరు విమానాశ్రయం

JantarMantar 2.o, పొట్టి దుస్తులతో వచ్చి ఆగి వున్న పోలీసు వాహనాన్ని ఆపినట్లు చేయేసిన యువతి, వీడియో

జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా ఆంక్షలు.. అభిజీత్ నాయనమ్మ, సావిత్రిబాయి దీప్కే కన్నుమూత

విమానంలోనే అభిజీత్ దిప్కేతో పాటు ఇతర సభ్యులు అరెస్ట్ (video)

అన్నీ చూడండి

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

Good Time Review : డైరెక్టర్ చాణక్య జిల్లా కు గుడ్ టైమ్ వచ్చిందా !. గుడ్ టైమ్ మేూవీ రివ్యూ

Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌

Nara Lokesh: రాయలసీమ నేపథ్యాన్ని రణబాలి ట్రైలర్ లో సహజంగా చూపారు : నారా లోకేష్

Prabhas vs Salman: మార్చి 2027లో పోరుకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఫౌజీ, సల్మాన్ మాన్‌స్టర్

తర్వాతి కథనం
Show comments