వేసవిలో ఈ కూరగాయలు తినాలి... ఎందుకో తెలుసా?
వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటిశాతం తగ్గుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ఆ సమస్యను తగ్గించుకోవడానికి నీటి శాతం పెంచుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవికాలంలో ప్రత్యేకంగా నీటిశాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని రకాల కూరగాయలు వేసవిలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.
1. నీటిశాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతనీ కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీనీ అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని పెంచుతుంది.
2. పొట్లకాయ తినడం వల్ల శరీరం పొడిబారకుండానూ, చల్లగానూ ఉండేలా చేస్తుంది.
3. బూడిదగుమ్మడి వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బీపీతో పాటు ఆస్తమా, రక్త సంబందిత వ్యాధులు, మూత్ర సమస్యలూ ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది.
4. బీరకాయ రక్తశుద్దికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
5. చల్లదనాన్నిఇవ్వడంతో పాటు మూత్ర సమస్యల్నీ తగ్గించేలా చేసేదే గుమ్మడి. ఇది పొట్టలోని నులిపురుగుల సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. చక్కెర వ్యాధిని, బీపీనీ అదుపులో ఉంచడంతో పాటు చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది.
6. కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడి పొక్కులూ, చెమటకాయలూ, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.