బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (16:59 IST)

వేసవిలో పెరుగును మరిచిపోకండి..

వేసవిలో పెరుగును ఏమాత్రం మరిచిపోకండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవిలో పెరుగు తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. రోజూ పెరుగు తింటే శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్‌ బి2, బి12, ప్రొటీన్లు, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా లభిస్తాయి. అన్నంతో పాటు పెరుగును తీసుకుని.. జారుగా మజ్జిగలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ రూపంలో పెరుగును తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.  
 
పెరుగులో లభించే బ్యాక్టీరియా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను చక్కబెడుతుంది. అంతేగాక పెరుగు మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీనిలోని బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములను నివారించి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీవక్రియలు సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.
 
పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేందుకు కారణమయ్యే కార్టిసాల్స్‌ హార్మోన్‌ నిల్వలను పెరగకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచి, ఊబకాయం బారిన పడకుండా చూస్తుంది. మజ్జిగలో కాస్త కొత్తిమీర తరుగును, చిటికెడు ఉప్పును కలిపి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.