శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (16:40 IST)

మరువం పువ్వులను ఎండబెట్టి.. టీ పెట్టి తాగితే?

మరువం పువ్వులను పువ్వులు అమ్మే షాపుల్లో చూసేవుంటుంది. అవి ఆకుల రూపంలో వాసనను వెదజల్లుతూ వుంటాయి. పువ్వుల మధ్య వాటిని కూర్చి సిగల్లో ధరించడం చేస్తుంటారు. ఆ మరువంను సిగల్లో ధరించడం ద్వారా వాసనే కాదు.. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు.  
 
నెలసరి సరిగ్గా రాని మహిళలూ మెనోపాజ్‌తో ఇబ్బందిపడేవాళ్లూ ఎండబెట్టిన పొడిని కొద్దిగా వంటల్లో వేసుకోవడం లేదా కాసిని ఆకుల్ని ఓ కప్పు నీళ్లలో వేసి మరిగించి తాగినా మంచి ఫలితం వుంటుంది. పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీంతో కాచిన టీ తాగడంవల్ల ఫలితం ఉంటుంది. మూత్ర సమస్యలూ తగ్గుతాయి. ఆకుల్నీ లేదా దీన్నుంచి తీసిన గాఢతైలాన్ని కొద్దిగా తీసుకుని వాసన చూడటంవల్ల గొంతులో శ్లేష్మం తగ్గుతుంది.
 
మరువం నుంచి తీసిన తైలం చర్మానికీ మంచిదే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర ముడతల్నీ తగ్గిస్తాయి. అందుకే క్రీములూ లోషన్లూ సోపుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. రెండుమూడు చుక్కల గాఢతైలాన్ని ఇతర నూనెల్లో కలిపి తలకి పట్టించి షాంపూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.