Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారణమైన కర్మములు.. అసాధ్యములుగాక..?

Updated: సోమవారం, 7 జనవరి 2019 (10:53 IST)
కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్నిగొందులం
దూరిన నెంతవారలకు దొల్లి పరీక్షితు శాపభీతుడై
వారధి నొప్పునుప్పరిగపై బదిలంబుగ దాగి యుండినం
గ్రూర భుజంగదంతహతి గూలడె లోకులెఱుంగ  భాస్కరా..
 
అర్థం: పూర్వము పరీక్షిత్తు అనే మహారాజు వేటకు వెళ్లి, ఆ అడవిలో వేటాడి అలసిపోయి, దప్పికగొని ఒక మునిని దాహానికి నీళ్లు ఇమ్మని అడిగెను. తపస్సున నేకాగ్రుడైన యా మునియు నీతని విచారింపడయ్యెను. అందులకు కోపించి ఆ రాజాముని మెడలో నొక చచ్చిన పామును వైచెను. అది చూచి మునిపుత్రుడు మా తండ్రి మెడలో పామును వైచినవాడేడు రోజులలో పాము గఱచి చచ్చుగాకని తిట్టెను. 
 
పరీక్షిన్మహారాజు ముని శాపముచే తనుకు కీడుకుల్గునని తలంచి సముద్రముంద మేడను నిర్మించేసి అందు దాగియుండినను, విధి విధానము యెవ్వవరిని నత్రిక్రమింప వీలుకాని దగుటచే నతడు తుదకు పాము కాటుచే మరణించెను. ఎంత గొప్ప వాడైనను దైవ విధానమునకు ప్రతి విధానముచేసి ఆ ఆపదలను తొలగించుకొందమన్నను, నవి అసాధ్యములుగాక, సాధ్యములగునా..?

అన్నీ చూడండి

మహిళలకు మరో శుభవార్త.. ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)

నా భర్త నా మతాన్ని మార్చాడు... ఐదుగురు మహిళలతో ఏకకాలంలో సహజీవనం.. భార్య

ఛీఛీ.. దిగజారిపోతున్న కంటెంట్ క్రియేటర్లు, రైలులోని టాయిలెట్స్‌లో రీల్స్, వీడియో

ఇమ్రాన్ ఖాన్‌కు స్వేచ్ఛ కల్పించండి.. ఒంటరిగా నిర్బంధించవద్దు : ఇస్లామాబాద్ హైకోర్టు

అన్నీ చూడండి

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

Suri: నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారు : సూరి

తర్వాతి కథనం
Show comments