1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (21:14 IST)

సహోదరులైనవారొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది...

కట్టడ దప్పి తాము చెడు కార్యము జేయుచునుండిరేని దో
బుట్టినవారినైన విడిపోవుట కార్యము దౌర్మాదాంధ్యముం 
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యు డా
పట్టున రాముజేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా..
 
అర్థం: దుర్మదాంధుడగు రావణాసురుడి విభీషణుడను పేరుగల తన సోదరుని ధర్మ బోధనలు పాటింపక యాతనిని చంప నుంకించెను. అందులకా విభీషణుడటనుండి రాముని సన్నిధికేగి, కొన్నాళ్లకు లంకాధిపతి యయ్యెను. అట్లే ధర్మ విషయమై సహోదరులైనవారొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది. అట్లు చేసిన మేలగను.