సేవ‌కు మారు పేరు... పుష్క‌ర వీరులు వీరు, సీఎం చంద్రబాబు సూపర్...(ఫోటోలు)

విజ‌య‌వాడ‌: ఏదో ఆశించి చేసేది సేవ కాదు.. వ్యాపారం. ఏమీ ఆశించ‌కుండా చేసేది దైవ కార్యం. అదే చేస్తున్నారిక్క‌డ కొంద‌రు రియ‌ల్ హీరోలు. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా కొంద‌రు యువ‌తీయువ‌కులు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అమితంగా భ‌క్తుల‌కు సేవ చేస్తున్నారు. వృద్ధుల

గురువారం, 18 ఆగస్టు 2016 (16:49 IST)
విజ‌య‌వాడ‌: ఏదో ఆశించి చేసేది సేవ కాదు.. వ్యాపారం. ఏమీ ఆశించ‌కుండా చేసేది దైవ కార్యం. అదే చేస్తున్నారిక్క‌డ కొంద‌రు రియ‌ల్ హీరోలు. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా కొంద‌రు యువ‌తీయువ‌కులు, స్వ‌చ్చంద సంస్థ‌ల వారు అమితంగా భ‌క్తుల‌కు సేవ చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులను జాగ్ర‌త్తగా పుష్క‌ర స్నానానికి తీసుకెళ్లి... పుణ్య స్నానం చేయించి ఘాట్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు చేర‌వేయ‌డంతో స‌హా అన్ని ప‌నులు చేస్తున్నారు. 
 
స్వ‌చ్చంద సంస్థ‌లే కాదు... కొంద‌రు పోలీసులు కూడా ఈ సేవ‌లో నిమ‌గ్నం కావ‌డం విశేషం. సాధార‌ణంగా పోలీసులు అంటే, అంద‌రికీ భ‌యం. కానీ, ఇక్క‌డ యువ కానిస్టేబుళ్ళు... చ‌క్క‌గా వృద్ధుల‌ను స్వ‌యంగా మోసుకుని వెళ్ళి పుష్క‌ర స్నానం చేయించి, తిరిగి వారిని బ‌య‌ట‌కు తెస్తున్నారు. ఇది ఏదో త‌మ పుష్క‌ర డ్యూటీలా కాక‌, మాన‌వ‌తా దృక్ప‌థంతో కొంద‌రు పోలీసులు చేస్తున్న సేవ కొనియాడ‌ద‌గింది.
 
వివిధ సంఘాల వారు, ఆధ్యాత్మిక సేవ సంస్థ‌ల వారు ప్ర‌త్యేకంగా కృష్ణా పుష్క‌రాల‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌లంటీర్లుగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లి వ‌చ్చారు. వీరంతా పుష్క‌ర యాత్రికుల‌కు అత్యుత్త‌మ సేవ‌లు స్వ‌చ్చందంగా అందిస్తున్నారు. అంతేగాక‌, కాపు, విశ్వ‌బ్రాహ్మ‌ణ‌, ఆర్య వైశ్య త‌దిత‌ర సంఘాల వారు పుష్క‌ర యాత్రికుల ఆక‌లి తీరుస్తున్నారు. అన్న‌దానం, ప్ర‌సాదాల విత‌ర‌ణ చేస్తూ, శ‌భాష్ అనిపించుకుంటున్నారు. పుష్కరాల నిర్వహణ కూడా అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన భక్తులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

అన్నీ చూడండి

అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన మహిళ.. చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి...?

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments