సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (08:32 IST)

వారణాసిలో మోదీ.. బీజేపీకే విజయం.. లోటస్ బర్ఫీలు.. లడ్డూలు సిద్ధం

ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందంజలో వున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమేథీలో ముందంజలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు రాయబరేలిలో ముందున్నారు. ఇక ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీలోని సిరి పోర్ట్ కాంప్లెక్స్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 
 
పశ్చిమ బెంగాల్.. అలిపుర్‌దుయర్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో వున్నారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్డీయే లీడింగ్‌లో వుంది. ఇక లక్నో సెంటర్లో బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో వున్నారు. 
 
అలాగే సినీనటి, బీజేపీకి చెందిన హేమమాలిని మథురాలో లీడింగ్‌లో వున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్‌లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో చురు, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎన్డీయే ముందంజలో వుంది. దీంతో బీజేపీ నేతలు లడ్డూ కేకులు, తామర పూవులాంటి బర్ఫీలను పంచేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.