Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమని పిలువను?

Written By Raju
Updated: శుక్రవారం, 14 మార్చి 2008 (16:55 IST)
FileFILE
ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..

నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..

ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...

నువ్వొచ్చావు.
ఆశాజీవనలతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..

నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...

సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..

జనజీవన సంస్కృతులను
కళ్లముందు ఆవిష్కరిస్తూ...
ఇన్నాళ్లుగా.. మనిషి సాగిస్తున్న
సహస్ర వృత్తుల శ్రమజీవిత పాఠాలు నేర్పుతూ..
నువ్వొచ్చావు...

ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?

అన్నీ చూడండి

శుభమా అని గృహ ప్రవేశం చేస్తుంటే, రూ. 50 వేలు ఇవ్వలేదని హిజ్రాలు డ్రెస్ అంతా ఎత్తి చూపించారు, వీడియో

నవంబరు నుంచి కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు...

ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...

మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు.. సీఎం రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను : కొండా సుష్మిత

'మహారాష్ట్ర ఆడపులి' ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య

అన్నీ చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

Raj Tarun: టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్ మూవీ : రాజ్ తరుణ్

Naga Chaitanya :నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

Show comments