శివరాత్రి పుణ్య ఘడియలలో శివాభిషేకంతో ఫలితాలు

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు. శివరాత్రి రోజు అర్పించడం, అభిషేకించడం వల్ల, సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజు

సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (18:37 IST)
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు. శివరాత్రి రోజు అర్పించడం, అభిషేకించడం వల్ల, సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. 
 
నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.  వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.
 
ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

అన్నీ చూడండి

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తర్వాతి కథనం
Show comments