కార్టూన్ బొమ్మలు చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లి... గడియ పెట్టి ఏంచేశాడో తెలుసా?
ముంబైలో అభంశుభం తెలియని బాలికపై 16 యేళ్ళ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. టీవీలో వచ్చే కార్టూన్ బొమ్మలు కలిసి చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగ
ముంబైలో అభంశుభం తెలియని బాలికపై 16 యేళ్ళ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. టీవీలో వచ్చే కార్టూన్ బొమ్మలు కలిసి చూద్దామని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగరంలోని దిందోషి ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
దిందోషి ప్రాంతంలో నివశించే 16 యేళ్ళ బాలుడి ఇంటి పక్కనే ఓ బాలిక ఆడుకుంటుంది. దీన్ని గమనించిన ఆ బాలుడు టీవీలో కార్టూన్లు చూద్దామంటూ తన ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు వేశాడు. ఆపై తలుపుకు గడియపెట్టి.. బాలికపై బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా అరవడంతో వదిలేశాడు.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలిక ఇంట్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. దీంతో వారుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడైన బాలుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.