ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (12:23 IST)

#ParliamentAttack : నేటితో 16 ఏళ్లు పూర్తి .. నేతల నివాళులు

భారత పార్లమెంట్ భవనంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి బుధవారంతో 16 యేళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మ

భారత పార్లమెంట్ భవనంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి బుధవారంతో 16 యేళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో పాటు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు.
 
గత 2001 డిసెంబర్ 13వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 9 మంది ముష్కరుల దాడిలో అమరులయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. 
 
ఉగ్ర దాడికి పాల్పడ్డ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ దాడికి కీలకపాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు భారత అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. 2013, ఫిబ్రవరి 9న తీహర్ జైలులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసి జైలులోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.