బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (12:36 IST)

ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ చేస్తే తప్పేముంది?: శరత్ కుమార్ మద్దతు

నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా సీనియర్ నటుడు శరత్ కుమార్, విశాల్ నువ్వా నేనా అన్నట్లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శరత్ కుమార్ విశాల్‌ను వెనకేసుకుని వచ్చారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పో

నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా సీనియర్ నటుడు శరత్ కుమార్, విశాల్ నువ్వా నేనా అన్నట్లు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శరత్ కుమార్ విశాల్‌ను వెనకేసుకుని వచ్చారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడంలో తప్పేముందని అడిగారు. కానీ విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఎంజీఆర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయని శరత్ కుమార్ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ తిరస్కరించడం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఎస్‌కే పేరుతో రూపొందించిన యాప్‌ను మంగళవారం చెన్నైలో శరత్ కుమార్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ యాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, విశాల్ పోటీ చేయడంలో తప్పేమీలేదన్నారు. 
 
నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న శరత్ కుమార్, సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా విశాల్‌ అంటేనే కారం మిరియాలు నూరే శరత్ కుమార్... విశాల్‌కు మద్దతు ప్రకటించడంపై కోలీవుడ్‌లో పెద్ద చర్చే సాగుతోంది.