ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (13:10 IST)

'జీవితానికి ముగింపు పలకాలనిపిస్తుంది' అని అంటూనే గర్ల్‌ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు!

'జీవితానికి ముగింపు పలకాలనిపిస్తుంది' అని అంటూనే గర్ల్‌ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడో ప్రియుడు. ఈ ప్రియుడు 21 యేళ్ళ మేనేజ్‌మెంట్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ విషాద సంఘటన ముంబైలో జరిగింది.

'జీవితానికి ముగింపు పలకాలనిపిస్తుంది' అని అంటూనే గర్ల్‌ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడో ప్రియుడు. ఈ ప్రియుడు 21 యేళ్ళ మేనేజ్‌మెంట్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ విషాద సంఘటన ముంబైలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ముంబైలోని మిరా రోడ్డులోని సన్మిత్ రాణే(21) తన ప్రియురాలితో ఇంట్లో కలుసుకున్నారు. ఇద్దరు ముచ్చటించుకుంటున్న క్రమంలో సన్మిత్ రాణే ఉన్నట్టుండి 'జీవితానికి ముగింపు పలకాలనిపిస్తుంది' అన్నాడు. అయితే అతను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేయడంతో వాటినంత సీరియస్‌గా పట్టించుకోలేదని ప్రియురాలు. 
 
'నువ్వు నన్ను శిక్షించాలనుకుంటే గనుక నేను నా జీవితానికి ఇక్కడితో ముగింపు పలుకుతా' అని తన గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడిన రాణే.. నేరుగా తన బెడ్ రూమ్‌లోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని అతని గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వెల్లడించింది.
 
రాణే ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని గర్ల్‌ఫ్రెండ్ తీవ్ర భయాందోళనకు లోనైంది. ఆ సమయంలో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్, మరో స్నేహితుడితో కలిసి.. కత్తితో సన్మిత్ రాణే మెడకు ఉన్న చున్నీని కోసి అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం సన్మిత్ రాణే ఆత్మహత్యను అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.