శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (11:17 IST)

ముగ్గురు మహిళా రైతులపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు

Truck
రైతులు ఓ వైపు కొత్త చట్టాల కారణంగా ఆందోళన బాట పట్టారు. అలాగే లఖింపూర్‌లో రైతులపై నుండి కేంద్ర సహాయ మంత్రి కాన్వారు దూసుకెళ్లిన ఘటన మర్చిపోకముందు మరో దారుణం హర్యానా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. 
 
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల నుండి ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ-హర్యానా బోర్డర్‌ టిక్రీకి సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుండి వేగంగా ట్రక్కు దూసుకెళ్లడంతో వారు చనిపోయారు. ఆటో కోసం ఎదురుచూస్తూ.. డివైడర్‌పై కూర్చొగా.. ఆ ట్రక్కు వేగంగా వారు పైకి దూసుకువచ్చింది.
 
వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. ఒకరిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.