బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:14 IST)

రిషికేశ్‌లో దారుణం.. యోగా కోసం వచ్చిన విదేశీ మహిళపై అత్యాచారం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్‌లో దారుణం జరిగింది. యోగా నేర్చుకోలాన్న ఆశతో భారత్‌కు వచ్చిన అమెరికా మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాకు చెందిన 37 యేళ్ళ మహిళపై యోగా నేర్చుకోవాలన్న తపనతో ఇటీవల భారత్‌కు వచ్చి రిషికేశ్‌కు వెళ్లింది. అక్కడ స్థానికంగా ఉండే అభినవ్ రాయ్‌తో ఆమెకు పరిచయమైంది. 
 
యోగా పట్ల ఆమెకున్న అభిరుచిని ఆసరాగా తీసుకున్న అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నివసించే గదిలోకి బాల్కనీ ద్వారా ప్రవేశించిన అభినవ్ రాయ్, ఈ నెల 5వ తేదీన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అంతకుముందు కూడా అతను ఆమెపై ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. యోగాపై బాధితురాలికి ఉన్న ఇష్టమే అభినవ్‌తో పరిచయం పెరిగేలా చేసిందని తమ విచారణలో తేలినట్టు సక్లానీ వెల్లడించారు.