శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (10:19 IST)

శారీరక దృఢత్వం - మానసిక ప్రశాంత కల్పించే యోగా : ఉపరాష్ట్రపతి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో యోగా ప్రాముఖ్యత గురించి సందేశమిచ్చారు. అంతకుముందు ఆయన తన అధికారిక నివాసంలో తన సతీమణి ఉషమ్మతో కలిసి యోగాసనాలు వేశారు. 
 
'కరోనా నేపథ్యంలో సురక్షిత దూరాన్ని పాటించేందుకు ‘ఇంటి వద్దే యోగా, కుటుంబంతో యోగా’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఇవాళ ఉదయం గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ.. ఉపరాష్ట్రపతి నివాసంలోని పచ్చికబయళ్లలో యోగాసనాలు వేశారు.
 
ఆ తర్వాత ఓ ట్వీట్స్ చేశారు. "శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతకోసం ప్రతి భారతీయుడూ యోగా, ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని.. జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యవంతంగా జీవించాలని' ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశాన్నిచ్చారు.