శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:26 IST)

ప్రముఖ తెలుగు పాత్రికేయుడి మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం

చెన్నై మహానగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో (టీవీ)లో పని చేస్తూ శ్రీనివాస్ అనే జర్నలిస్టు అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర సంతాంపం తెలుపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"ఈటీవి (చెన్నై) పాత్రికేయుడు శ్రీ శ్రీనివాస్ మృతి విచారకరం. వృత్తి పట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం వారిని ఆదర్శ పాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
కాగా, ఎన్నో సంవత్సరాలుగా చెన్నైలో పని చేస్తూ వచ్చిన జర్నలిస్టు శ్రీనివాస్ ఇటీవలే ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరానికి బదిలీ అయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్చగా, సోమవారం అర్థరాత్రి 12 గంటల సయమంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మృతిపట్ల చెన్నైలోని తెలుగు పాత్రికేయల మిత్రులు తీవ్ర సంతాపం తెలుపుతూ, తమకు శ్రీనివాస్‌కు మధ్య సంబంధాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.