శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (09:50 IST)

కరోనా ఎఫెక్టు : ఏప్రిల్ నెలలో 75 లక్షల ఉద్యోగాలు ఊస్ట్

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రతి రంగంపై ఇది తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేవలం ప్రాణాలను హరించడమే కాకుండా.. జీవనోపాధి కూడా లేకుండా చేస్తోంది. ఈ వైరస్ పుణ్యమాని లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డునపడుతున్నారు. 
 
ఈ క్రమంలో గత ఏప్రిల్ నెలలో ఏకంగా75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది గత నాలుగు నెలలతో పోల్చితే అధికం. ఈ విషయాన్ని సీఎంఐఈ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. ఫలితంగా నిరుద్యోగిత రేటు మరింత పెరిగిందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ కల్పన పెను సవాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
 
కాగా, మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేట ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల ప్రభావం ఉద్యోగాలపై పడిందని వ్యాస్ పేర్కొన్నారు.