ఐపీఎల్ సీజన్ 14 : సీఎస్కే జట్టులో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్

Chennai Super Kings
Chennai Super kings
ఠాగూర్| Last Updated: సోమవారం, 3 మే 2021 (15:28 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై జట్టులో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బంది, ఫ్రాంఛైజీ అధికారులు, ఇతరులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ముగ్గురికి పాజిటవ్‌గా నిర్ధారణ అయింది.

చెన్నై టీమ్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. వైరస్‌ బారినపడిన వారిలో ఆటగాళ్లు ఎవరూ లేరని సమాచారం.

చెన్నై టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఒక బస్‌ క్లీనర్‌లకు వైరస్‌ సోకినట్లు తెలిసింది.
నాన్ ‌- ప్లేయింగ్‌ మెంబర్స్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఫ్రాంఛైజీ అప్రమత్తమైంది. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు చెందిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌ల‌కు క‌రోనా సోకింది. దీంతో సోమ‌వారం రాత్రి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.దీనిపై మరింత చదవండి :