బాడీ బిల్డర్-చిట్టెలుక.. ఫోటో వైరల్.. వాళ్లిద్దరూ ఎవరంటే..?
ఐపీఎల్ 2021 సీజన్‌లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ ఆటగాళ్లు విజయోత్సవంలో ముగినిపోయారు. ఈ సందర్భంగా క్రిస్ గేల్-యజ్రేంద్ర చహల్‌లు తమ వంటిపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. ఈ పిక్‌ను పంజాబ్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రిస్ గేల్-ఆర్సీబీ స్పిన్నర్ అయిన చహల్‌లు మంచి స్నేహితులు. అలానే వీరికి హడావుడి చేయడానికి ఏ అవకాశం వచ్చిన వదులుకోరు. జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు.
యూనివర్శల్ బాస్ గేల్ తన కండలను చూపిస్తూ ఫోజులిచ్చాడు. చహల్ బక్కగా ఉండడంతో బాడీ చూపించడానికి కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బోన్స్ వర్సెస్ ఆర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.