సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

వడదెబ్బ.. మహారాష్ట్రలో గర్భిణీ మృతి..ఏడు కిలోమీటర్లు నడిచే వెళ్తే..?

భారత్‌లో వేసవి తాపం విజృంభిస్తున్న వేళ.. వడదెబ్బకు గురై ఓ గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాకు చెందిన సోనాలి (19) ఓసర్ వీర గిరిజన గ్రామానికి చెందినది. ఈమె 9 నెలల గర్భిణిగా ఉంది. అయితే వేడిమి కారణంగా అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆమె వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. 
 
ఆపై దావా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి గజల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మహిళ కుటుంబీకులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.