మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (16:40 IST)

శశికళకు సీఎం పోస్టు ఇస్తే.. అన్నాడీఎంకే ముక్కలు కావడం ఖాయం.. స్వామినాథన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నాయకులను ఒక్కతాటి పైకి తేగలరేమో కానీ కేడర్‌ను మాత్రం ఏకతాటి పైకి తేలేరని ప్రముఖ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి జోస్యం చెప్పారు. పార్టీ కేడర్ శశికళను ఎట్టి

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నాయకులను ఒక్కతాటి పైకి తేగలరేమో కానీ కేడర్‌ను మాత్రం ఏకతాటి పైకి తేలేరని ప్రముఖ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి జోస్యం చెప్పారు. పార్టీ కేడర్ శశికళను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని స్పష్టం చేశారు. ఆసక్తికరమైన కామెంట్ ఏంటంటే.. ప్రస్తుతం తమిళనాడుకు ముఖ్యమంత్రి లేరని చెప్పారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుంటే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు.
 
శశికళ ఇటీవలే అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా ఎన్నికైన నేపథ్యంలో.. అన్నాడీఎంకే ముక్కలు కావడం ఖాయమని తెలుస్తోందన్నారు. కానీ ఒక్కరోజులో అన్నాడీఎంకే పార్టీ ముక్కలయ్యేది కాదని, క్రమంగా మాత్రం ముక్కలు కావడం ఖాయమన్నారు. నాయకున్ని బలవంతంగా రుద్దితే పార్టీ విడిపోవడం ఖాయమన్నారు. ఎందుకంటే బలవంతంగా తీసుకు వచ్చే నాయకుడిని కేడర్ అంగీకరించదని చెప్పారు.
 
1972లో ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి విడిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించారని, 1987-88లలోను అదే జరిగిందని తెలిపారు. అందుకే ప్రస్తుతం కేడర్, నాయకత్వానికి మధ్య కుదరడం లేదన్నారు.