మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (07:37 IST)

తాజ్‌హమల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం... నివేదిక కోరిన ఆర్కియాలజీ విభాగం

ప్రముఖ పర్యాటక ప్రదేశం, ప్రేమమందిరమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ విమానం చక్కర్లు కొట్టడం ఇపుడు కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో విమానం తిరగడాన్ని పురావస్తు శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో సీఐఎస్ఎఫ్ విభాగాన్ని ఆర్కియాలజీ అధికారులు నివేదిక కోరారు. 
 
ప్రస్తుతం తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ చక్రర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంలో రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
 
నిజానికి ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాన్లు, డ్రోన్లపై ఆంక్షలు విధించారు. ఇవి అమల్లో ఉన్న సమయంలో ఈ విమానం నో ఫ్లైయింగ్ జోన్‌లోకి ఎలా వచ్చిందని ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కోరింది.