1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (17:03 IST)

తాజ్ మహల్ పేరు మారబోతుందట.. రామ్ మహల్ లేదంటే రామ్ మందిర్.. చెప్పిందెవరంటే?

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అనే పేరు.. వినడానికి విన సొంపుగా ఉంటుంది. తాజ్ మహల్ అనే పేరు వినిపించగానే.. అందరి గుండెలూ.. ప్రేమగా స్పందిస్తాయి. అయితే ఈ వార్త వినేవారికి మాత్రం కోపం తన్నుకొస్తుంది. అదేం వార్త అనుకుంటున్నారా..? త్వరలోనే తాజ్ మహల్ పేరు మారబోతుందట. అది కూడా రామ్ మహల్ గానో.. క్రిష్ణ మహల్ గానో మారుతుందంట. 
 
ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరుతో తాజ్ మహల్‌కి రీ నామకరణం చేస్తారట. వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా ఇదే నిజమని బీజేపీ నేతలు అంటున్నారు.  ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కామెంట్స్ చేశారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఒకప్పుడు తాజ్ మహల్ ఉండే దగ్గర శివాలయం ఉండేదట. తాజ్ మహల్ పేరు మారుస్తారు మా యోగి ఆదిత్యనాథ్. కచ్చితంగా మార్చి తీరుతారు. రామ్ మహల్‌గా కానీ.. క్రిష్ణ మహల్ గా కానీ పేరు పెడతారు అంటున్నారు సురేంద్ర సింగ్. ఇక్కడ జనానికి అర్దం కాని పాయింట్ ఏంటంటే.. అక్కడ గతంలో శివాలయం ఉంటే.. శివ్ మహల్ అని పేరు పెట్టాలి కానీ.. రామ్ మహల్ అని ఎందుకు పెడతారనేదే..!