1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:20 IST)

గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా అమిత్ షా : అరవింద్ కేజ్రీవాల్ జోస్యం

గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యతలు చేపట్టవచ్చని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. వయసుమీదపడటంతో తనను సీఎం బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ గుజ

గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యతలు చేపట్టవచ్చని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. వయసుమీదపడటంతో తనను సీఎం బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ బీజేపీ అధిష్టానాన్ని కోరిన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో ఆమె స్థానాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భర్తీ చేయనున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడం, రాష్ట్రంలో 'ఆప్'కు మద్దతు పెరుగుతుండడంతోనే ఆనందీబెన్‌ను తప్పిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమె స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ముఖ్యమంత్రిని చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని అందులో పేర్కొన్నారు.