ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎందుకు వచ్చిందో తెలుసా?
ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ. సాధారణంగా ఏప్రిల్ ఒకటి అనగానే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉదయం నుండి తమ సన్నిహితులను, స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేస్తుంటారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. అవి విన్నవారు అది నిజమని నమ్మగానే ఏప్రిల్ ఫూల్ అంటూ ఉంటారు. ఇలా మరొకరిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కొద్దిరోజుల ముందు నుంచే ప్లాన్‌లు వేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?
నిజానికి ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్ ఖండంలో పుట్టింది. 15వ శతాబ్దంలో యూరప్‌లో మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. అయితే 1582లో పోప్ గ్రెగరీ ఒక కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసి, దాని ప్రకారం నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
అయితే ఈ క్యాలెండర్‌ను అనుసరించమని చాలా దేశాలు స్పష్టం చేసాయి. దీనితో పోప్ గ్రెగరీ తరపున కొందరు నిలిచి, ఏప్రిల్ ఒకటో తేదీ కొత్త సంవత్సరంగా నమ్మేవారిని ఫూల్స్ కింద జమకట్టి ఏప్రిల్ ఫూల్స్ అంటూ ఏడిపించేవారు. కాలక్రమేణా అది ప్రపంచమంతా పాకింది.