గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:25 IST)

ఎగిరే విమానంలో దుస్తులు విప్పి అసభ్యంగా... పైలెట్లు అత్యవసరంగా విమానాన్ని...

ఓ ప్రయాణికుడు ఎగిరే విమానంలో బీభత్సం సృష్టించాడు. పూటుగా మద్యం సేవించి వచ్చిన అతగాడు విమాన సిబ్బందితో గొడవకు దికి దుస్తులు విప్పి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు-ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానం ఐ5-722 ఏప్రిల్ 6న బెంగళూరు నుంచి ఢిల్లీ బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించాక ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అలా గొడవపడుతూనే అకస్మాత్తుగా దుస్తులు విప్పేసి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
తోటి ప్రయాణికులు ఎంత వారించినా అతడు వినిపించుకోలేదు. చివరికి ఎలాగో అంతా కలిసి బ్రతిమాలడంతో తన సీట్లో కూర్చున్నాడు. ఈ ఘటన గురించి సిబ్బంది పైలెట్లకు తెలియజేయగా వారు విమానం ల్యాండ్ అయ్యాక సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆ వ్యక్తిని అప్పగించారు. అతడిపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసారు.