మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (13:31 IST)

దేశ ప్రజలను నాప్‌కిన్స్‌లా చూస్తున్న నరేంద్ర మోడీ : అరుణ్ శౌరీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వానిది ఏకవ్యక్తి పాలన. దీనివల్ల భారత ప్రజాస్వామ్యానికి చేటు తప్పదు. ప్రజలను వాడుకొని వదిలేయడం ప్రధాని వైఖరి అని ఆయన ధ్వజమెత్తారు. 
 
ఆయన దేశ పౌరులను పేపర్‌ నాప్‌కిన్స్‌ మాదిరి చూస్తారు. దేశ పాలన పగ్గాలు అప్పగించి ప్రజలిచ్చిన గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన విభజించు పాలించు పద్ధతిని అనుసరిస్తున్నారు. పాక్‌తో ఆయన వైఖరి మూలంగా ఆ దేశం దృష్టిలో మనల్ని మనం ఫూల్స్‌గా చేసుకుంటున్నామన్నారు.